Friday, November 22, 2024

ఢిల్లీలో ఘ‌నంగా కాళోజీ జయంతి వేడుకలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధానిలో ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం కాళోజీ నారాయణరావు 108వ జయంతిని నిర్వహించారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం. సాహ్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కె.ఎం సాహ్ని మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారునిగా, కవిగా తెలంగాణ సమాజానికి కాళోజీ చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. అన్యాయం ఎక్కడ జరిగినా కాళోజీ గళమెత్తేవారని, అసమానతలు, దోపిడీ, నిరాదరణకు గురవుతున్న వారిలో ఆయన కలం చైతన్యాన్ని నింపిందని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ గుర్తు చేశారు. తెలంగాణ భాషకు, యాసకు, సాహిత్యానికి చేసిన కృషికి గుర్తుగా కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement