Tuesday, November 26, 2024

రష్యా చేతుల్లోకి కఖోవ్కా, నీపర్‌ నదిపై పట్టు.. వ్యూహాత్మక ప్రాంతంగా గుర్తింపు

దక్షిణ ఉక్రెయిన్‌లోని నోవా కఖోవ్కా నగరం రష్యా చేతుల్లోకి వెళ్లిపోయినట్టు ఉక్రెయిన్‌ మీడియా పేర్కొంది. ఇది చిన్న నగరమే.. అయితే నీపర్‌ నదికి ఇది వ్యూహాత్మక ప్రాంతంలో ఉంటుంది. క్రైమియా పీఠభూమికి నీరు అందించేది కూడా ఇక్కడి నుంచే.. నగరాన్ని రష్యా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయని మేయర్‌ వొలిదిమిర్‌ కోవాలెంకో ప్రకటించారు. ప్రభుత్వ భవనాల నుంచి ఉక్రెయిన్‌ జెండాలను తొలగించారని పేర్కొన్నారు. ఇక్కడి వీధుల్లో రష్యన్‌ ఆర్మీ తిరుగుతున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. నోవా కఖోవ్కా పూర్తిగా రష్యా చేతుల్లోకి వెళ్లిపోయింది. క్రైమియా, సెవస్టపోల్‌ నగరానికి మంచినీరు అందించే నీపర్‌ నదిపై రష్యాకు పట్టు లభించినట్టయ్యింది.

రష్యాలో పుట్టిన ఈ నది నుంచి సోవియన్‌ సమయంలో నిర్మించిన ఉత్తర క్రిమియా కాల్వ ద్వారా క్రిమియాకు నీటి సరఫరాను చేస్తున్నారు. కానీ, కొన్నేళ్లుగా ఉక్రెయిన్‌ నీటి సరఫరాను అడ్డుకోవడంతో క్రెవ్లిున్‌ ఆగ్రహానికి కారణంగా నిలిచింది. క్రిమియాలో తగిన నీటి వనరుల్లేవు. 2014 తరువాత కీవ్‌ నీటి సరఫరాలో సమస్యలు సృష్టించడంతో గతేడాది క్రిమియాలో కరువు పరిస్థితి నెలకొంది. దీనికి ఉక్రెయిన్‌ కారణమని రష్యా ఆగ్రహంగా ఉంది. తాజాగా రష్యా దళాలు నగరంలోకి ప్రవేశించి ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ భవనాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అక్కడ ఉన్న ఉక్రెయిన్‌ జెండాలను తొలగించాయి. ఇక ఖెర్సాన్‌, మైకోలైవ్‌, మెల్టోపోల్‌పై కూడా రష్యా దళాలు దృష్టిపెట్టాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement