Saturday, November 23, 2024

స్పృహలోకి వచ్చిన కైకాల.. విషమంగానే ఆరోగ్యం

ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషయంగా ఉంది. ఈ మేరకు హైదరాబాద్ అపోలో వైద్యులు తెలిపారు. కైకాల ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. అయితే, నిన్న కైకాల స్పృహలోకి వచ్చారు. రక్తపోటు (BP) స్థాయి చాలా తక్కువగా ఉండడంతో, రక్తపోటును సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు వాసో ప్రెజర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆయన స్పృహలోనే ఉన్నారని, పరిస్థితి విషమంగానే ఉన్నందున ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement