దేశంలో దళితుల సంక్షేమానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణలోని ఎస్సి, ఎస్టీ నియోజకవర్గల్లో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్.. అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ ఇచ్చిన హక్కులను కలరాస్తున్నారని విమర్శించారు. ఎస్సి, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగ కల్పించిన నియోజకవర్గలను పరోక్షంగా ఎత్తి వేసేందుకు ప్లాన్ చేస్తుందని కడియం ఆరోపించారు. ప్రస్తుతం జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని జోస్యం చెప్పారు.
2023,2024లో జరిగే ఎన్నికల్లోనూ బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పారు. ఎస్సి ఎస్టీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేడారం సమ్మక్క సారాలమ్మ పండుగను జాతీయ పండుగ ప్రకటించాలని కేంద్ర టూరిజం శాఖామంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తరువాత వరంగల్ గిరిజన, విశ్వవిద్యాలయం ఏర్పాటు కాలేదన్నారు. ఇతర రాష్ట్రాలో ఏర్పాటు చేశారని మండిపడ్డారు. పొడు భూముల విషయంలో బండి సంజయ్ కు అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. అటవీశాఖ భూములు కేంద్ర ఆధీనంలో ఉంటుందన్నారు. దమ్ముంటే కేంద్రప్రభుత్వంపై ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. షెడ్యూలు తెగల వారికోసం బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమిటి ? అని ప్రశ్నించారు. బండి సంజయ్ అవగాహన లేకుండా కులమతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే విభజన హామీలను అమలు చేయాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.