వరంగల్ – రేపో మాపో జగన్ మళ్ళీ జైలుకు వెళ్లే అవకాశాలున్నాయని, ఎపికి వెళితే మీకు పదవి దక్కే అవకాశాలన్నాయంటూ తెలంగాణ వైసిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు హితవు పలికారు బిఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. తెలంగాణ బడ్జెట్ పై ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన కడియం తెలంగాణలో తిరిగి షర్మిల తన సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు.
షర్మిల తన రాజకీయాన్ని ఆంధ్రకు మార్చుకోవాలని సూచించారు. వైయస్ కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమేనని.. సమైక్యాంధ్ర నినాదంతో ఊరురా తిరిగిన వ్యక్తి షర్మిల అని కడియం తెలిపారు. జగన్ జైలుకు వెళ్ళినప్పుడు విజయలక్ష్మి, షర్మిల ఎపిలో పాదయాత్రలు చేశారని, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల కి రాజకీయంగా జగన్ అన్యాయం చేశారని విమర్శించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆంధ్రకు వెళ్లి ప్రజలతో షర్మిల మొరపెట్టుకోవాలని సూచించారు.