కడెం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నది. ఎగువన మోస్తారు వర్షాలతో ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కులకుపైగా వదర వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ఇప్పటికే నిండిపోయింది. దీంతో ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఆనకట్ట పై నుంచి వరద ప్రవహిస్తున్నది. ప్రాజెక్టు ఇరువైపులా గట్లపై నుంచి నీరు పారుతున్నది. దీంతో ఎన్ని టీఎంసీల నీరు ప్రవహిస్తున్నదనేది లెక్కించలేని పరిస్థితి ఏర్పడింది. భారీగా వరద పోటెత్తడంతో అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడెం గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement