Saturday, November 23, 2024

ముగిసిన క‌డ‌ప జిల్లా పర్యటన… విజయవాడ బయలుదేరిన సీఎం జ‌గ‌న్

కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా మూడు రోజుల పర్యటన ముగించుకొని శనివారం ఉదయం 9.33 గంటలకు విజయవాడ బయలుదేరి వెళ్ళారు. జిల్లాకు ఆయన ఈనెల 1న చేరుకున్నారు. సొంత నియోజకవర్గంలోని వేముల మండలం వేల్పుల‌లో పలు అభివృద్ధి భవనాలను మొదటి రోజు ప్రారంభించారు. రెండవ రోజున శుక్రవారం ఇడుపులపాయలో తన కుటుంబ సభ్యుల‌తో కలిసి తండ్రి వైఎస్ కు నివాళులర్పించి, వైఎస్ ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ ప్రార్ధనల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, భార్య భారతిలతో పాటు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. తర్వాత పులివెందల, వేంపల్లి , చక్రాయపేట మండలాల్లోని అభివృద్ధి పనులపై సమీక్షించారు. పులివెందుల ప్రాంత అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఈ సందర్భంగా వారందరికీ భరోసా ఇచ్చారు. గురు, శుక్రవారాల్లో ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలసి బస‌ చేసిన ఆయన శనివారం ఉదయం ఇడుపులఅ పాయ నుండి నుండి కడప ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నుండి ప్రత్యేక విమానం ద్వారా విజయవాడ బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఆయనకు కలెక్టర్ విజయ రామరాజు, ఎస్పీ అనురాజన్, ఇన్ చార్జి మంత్రి ఆది మూలం సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జన రెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement