స్టార్ హీరోలందరితో కలిసి నటించారు కాదంబరి కిరణ్. . కేవలం నటుడుగా మాత్రమే కాకుండా మిగిలిన విభాగాలపరంగా కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. అలా మనం సైతం పేరుతో పలువురికి సహాయం కూడా అందించారు. చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈయనకు వారసులు లేరు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు.. ఇద్దరికీ కూడా ఇప్పుడు చాలా ఘనంగా వివాహం జరిపించారు. . 2021 డిసెంబర్ లో పెద్దమ్మాయికి పెళ్లి చేసిన కాదంబరి కిరణ్.. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లిని కూడా హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.ఈ పెళ్లికి తలసాని శ్రీనివాస్ యాదవ్, జెడి లక్ష్మీనారాయణ, కోటా శ్రీనివాసరావు, ఆలీతోపాటు పలువురు ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement