Friday, November 22, 2024

కబడ్డీ క్రీడాకారుడి ఆత్మహత్య.. కారణలేంటో తెలియలేదన్న పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు త‌న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. కబడ్డీ క్రీడాకారుడు విక్రాంత్ తన గదిలో ఉరివేసుకుని కనిపించాడు. అది చూసిన కుటుంభ స‌బ్యులు వెంటనే ఓ ప్రైవేటు వైద్యుడిని సంప్ర‌దించ‌గా.. అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, విక్రాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

2021లో కాన్పూర్ మండల కబడ్డీ పోటీల్లో విక్రాంత్ ఎంపికయ్యాడని.. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో కూడా పాల్గొన్నాడని త‌న‌ అన్నయ్య వికాస్ పోలీసుల‌కు తెలిపారు. దాంతోపాటు అర్మాపూర్‌లోని జీకే మైదానంలో వర్ధమాన కబడ్డీ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేవాడని కూడా తెలిపారు.

రీసెంట్ గా విక్రాంత్ కళ్యాణ్‌పూర్‌లో ఐస్‌క్రీం పార్లర్‌ను కూడా తెరిచాడు. “స్నేహితులతో కలిసి గంగ బ్యారేజీ వద్దకు వెళ్లాడ‌ని.. అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. నిద్ర లేచి చూసేసరికి విక్రాంత్ గది తలుపు తెరిచి ఉంది. నేను అతని గదిలోకి వెళ్లి చూడగా, అతని మృతదేహం షీట్‌తో చేసిన ఉరిలో, సీలింగ్ ఫ్యాన్ హుక్‌కు కట్టివేయబడి కనిపించింది.” అతని సోదరుడు వికాస్ తెలిపాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పంకి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రత్నేష్ కుమార్ సింగ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement