విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ… కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధికార వైసీపీ పార్టీ, ప్రతిపక్ష టిడిపి సహా మిగిలిన పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం లేదు. ఇక ఇదే విషయంపై తాజాగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మార్చి 21 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అలాగే ఢిల్లీ సరిహద్దులలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. నూతన సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కే ఏ పాల్ డిమాండ్ చేశారు.