లఖింపూర్‌ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది. సీల్డ్ కవర్‌లో దర్యాప్తు నివేదిక అందజేసింది యూపీ ప్రభుత్వం. 68 మందిలో 30 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్టు కోర్టుకు తెలిపింది. 23 మంది ప్రత్యక్ష సాక్షులున్నారని వెల్లడించింది.
వందల సంఖ్యలో రైతుల ర్యాలీ నడుస్తుండగా ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మంది మాత్రమే ఉన్నారా..? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండో ఎఫ్ఐఆర్‌పై కూడా నివేదిక కోరింది. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏ కేసులోనైనా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం కీలకమని సాక్షులకు భద్రత కల్పించాలని సూచించింది.