Tuesday, November 26, 2024

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం

హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల (అర్బిట్రేషన్‌) కేంద్రం ఏర్పాటైంది. ఈ మేరకు ఈ అంతర్జాతీయ అర్బిట్రేషన్‌ ట్రస్ట్‌ డీడ్‌ రిజిస్టేషన్‌ శుక్రవారం పూర్తి అయింది. ఈ కార్యక్రమానికి సీజేఐ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు జడ్జిలు ఎల్‌ నాగేశ్వరరావు, ఆర్‌.సుభాష్‌ రెడ్డి, హై కోర్టు సీజే హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, మల్టి నేషనల్‌ కంపెనీలు అర్బిట్రేషన్‌ కోసం సింగపూర్‌, దుబాయ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఆర్భిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుతో హైదరాబాద్‌‌కు అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు రానున్నారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. అంతర్జాతీయ అర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుతో వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. పీవీ నరసింహారావు హయంలో ఆర్థిక సంస్కరణలు జరిగాయని… పెట్టుబడులు పెట్టేవారు.. లిటిగేషన్లతో ఇబ్బందులు పడుతుంటారని తెలిపారు. అయితే.. ఆ సమస్యలను పరిష్కరించేందుకు.. అర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివాదాల పరిష్కారానికి కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పరిశ్రమలకు ఆర్బిట్రేషన్‌ కేంద్రంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ అర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు సీజేఐ మానస పుత్రిక అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఈటలను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది: కిషన్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement