ఎన్నికల వ్యవస్థపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పెద్ద ఎత్తున అసమానతలు, నిరక్షరాస్యత, వెనుకబాటుతనం, పేదరికం, అజ్ఞానం ఉన్నా స్వతంత్ర భారతదేశ ప్రజలు తమను తాము తెలివైనవారని నిరూపించారని ఎన్వీ రమణ అన్నారు. ఎన్నికలు, విమర్శలు, నిరసనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు కీలకమైనవి అని అభిప్రాయపడ్డారు. శాసనసభ లేదా కార్యనిర్వాహక సంస్థ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా న్యాయవ్యవస్థను నియంత్రించలేవని, రూల్ ఆఫ్ లా పాటించాల్సిందేనన్నారు. న్యాయ వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ ఉండాలన్నారు.
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తమ పాలకుడిని మార్చుకోవచ్చని, అయితే అందులో దౌర్జన్యకారులను మార్చేయాలన్న ప్రత్యేకత ఏమీ లేదని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు 17లోక్ సభ ఎన్నికలు జరగ్గా అందులో అనేక పార్టీలు ప్రభుత్వాన్ని కోల్పోగా… మరికొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు. సోషల్ మీడియా అభిప్రాయాలు న్యాయమూర్తులను నియంత్రించలేవన్నారు. సోషల్ మీడియా పోకడలు సంస్థలను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై ప్రసంగం ప్రారంభించడం అత్యవసరం అని ప్రధాన న్యాయమూర్తి నొక్కి చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చేవి తప్పు ఒప్పులను, మంచి చెడుల మధ్య తేడాలను గుర్తించలేవన్నారు.
ఇది కూడా చదవండి: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ