Tuesday, November 26, 2024

నర్సింగ్ అభ్యర్థులకు న్యాయం చేయాలి.. లేకుంటే ఉద్యమం తప్పదు: నర్సింగ్ స్టూడెంట్స్ ఫెడరేషన్

గుంటూరు, (ప్రభ న్యూస్): రాష్ట్ర వ్యాప్తంగా బిఎస్సి నర్సింగ్ చదివిన అభ్యర్థులందరికి న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ సంక్షేమ సంఘ ఎమ్ ఎల్ హెచ్పీఅభ్యర్థులు సోమవారం ఆర్డీ ఆఫీస్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గా ఏపీఎన్ఎస్ఎస్, ఏపీ ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎం.విక్టోరియా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్సీ నర్సింగ్ చదివినా నిరుద్యోగులు 90 వేలకు పైగా ఉంటే కేవలం సి పి సి హెచ్ సర్టిఫికెట్ ఉన్న 2020 సంవత్సరం వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించమని న్యాయస్థానం తమకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందన్నారు.

ఒకపక్క వైద్య ఆరోగ్య శాఖని అద్భుతంగా తీర్చిదిద్దుతాం అని చెప్పే రాష్ట్రప్రభుత్వం అదే వైద్య ఆరోగ్య శాఖకు గుండె లాంటి నర్సింగ్ అధికారుల పట్ల దారుణమైన వివక్షత చూపుతుందన్నారు ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్క రెగ్యులర్ నర్సింగ్ నోటిఫికేషన్ లేకపోవడం కోవిడ్ సమయాల్లో రోగుల ప్రాణాలు కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన నర్సింగ్ అధికారులను విధుల నుండి తొలగించడం రాష్ట్రప్రభుత్వం నర్సింగ్ వ్యవస్థ పై చూపిస్తున్న వివక్షతకు నిదర్శనమన్నారు.

ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆరోగ్యశాఖకు ఆయు పట్టులాంటి నర్సింగ్ అధికారులకు శాశ్వత ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే భవిష్యత్తులో నర్సింగ్ అధికారులు ఆగ్రహం చవిచూడక తప్పదు అన్నారు. ఏపీఎన్ఎస్ఎస్, ఏపీ ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్పీఅభ్యర్థులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement