Saturday, November 23, 2024

ప్రజల ముంగిట్లోకి న్యాయం.. భారతీయ న్యాయవ్యవస్థలో మరో మైలురాయి..

ఈ నెల 13వ తేదీన మహరాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో డిజిటల్‌ లోక్‌ అదాలత్‌లు ప్రారంభం కానున్నాయి. సామాన్య ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశ్యంతో మహరాష్ట్ర లీగల్‌ సెల్‌ అథారిటీ (ఎంఎస్‌ఎల్‌ఎస్‌ఎ), రాజస్థాన్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌ఎస్‌ఎ) ఏర్పాటుకానున్నాయి.దీంతో న్యాయం కోసం చెప్పులరిగేలా కోర్టుల చుట్టూ తిరగకుండా ఇంటి నుంచే న్యాయం కోరడానికి ప్రజలకు వెసులు బాటు కానుంది.

ప్రజలకు వెంటనే న్యాయం అందడానికి లోక్‌ అదాలత్‌లు దోహదపడనున్నాయి. భారత న్యాయ వ్యవస్థలో ఇది మైలు రాయి అని చెప్పొచ్చు. కోర్టులలో రోజు రోజుకు పేరుకుపోతున్న కేసుల సంఖ్యను తగ్గించాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. మనదేశంలో మొదటిసారిగా పూర్తిస్థాయి డిజిటల్‌ లోక్‌ అదాలత్‌లు ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement