Monday, November 18, 2024

జూరాల, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు పోటెత్తిన వరద…

జూరాల, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కృష్ణానది పరీవాహంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. జలాశయానికి 2.50 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 44 గేట్లు ఎత్తి 2.44 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు. ప్రస్తుతం 8.3 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

ఇక నాగార్జునసాగర్‌కు 3.93 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 24 గేట్లు ఎత్తివేసి 3.41 లక్షల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయంలో గరిష్టంగా 312 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు 300 టీఎంసీల నీరు ఉన్నది. కుడి, ఎడమ కాలువలకు నీటివిడుదల కొనసాగుతున్నది

Advertisement

తాజా వార్తలు

Advertisement