Friday, November 22, 2024

NASA | ‘‘జ్యూపిట‌ర్ అల్ట్రావైలెట్ వ్యూ’’.. నీలం రంగులో అబ్బురపరుస్తున్న‌ బృహస్పతి

మన విశ్వానికి సంబంధించి నాసా తరచూ అద్భుతమైన చిత్రాలను విడుదల చేస్తుంటుంది. ఇవి అంతరిక్ష ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఇవ్వాల (సోమవారం) కూడా నాసా ఇలాంటి అద్భుత చిత్రాన్ని ఇన్‌స్టాలో రిలీజ్‌ చేసింది. అతిపెద్ద గ్రహమైన బృహస్పతి అతినీలలోహిత వర్ణంలో (జ్యూపిట‌ర్ అల్ట్రా వైలెట్ వ్యూతో) మిరుమిట్లు గొలుపుతున్న ఈ దృశ్యాన్ని హబుల్‌ టెలిస్కోప్‌ క్లిక్‌మనిపించింది.

సూర్యుడు, బృహస్పతి ఎదురెదురుగా ఉన్న సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. అత్యంత ఎత్తులో ఉండే పొగమంచు కణాలు తరంగదైర్ఘ్యాల (వేవ్ లెంత్) వద్ద కాంతిని గ్రహించడం వల్ల ఈ గ్రహం హబుల్‌ టెలిస్కోప్‌కి అతినీలలోహిత వర్ణంలో కనిపించింది అని నాసా పేర్కొంది.

శాస్త్రవేత్తలు బృహస్పతిపై తుఫాను వ్యవస్థలను అధ్యయనం చేయడానికి అతినీలలోహిత తరంగ దైర్ఘ్యాలను ఉపయోగిస్తారు. తద్వారా బృహస్పతి వాతావరణాన్ని నిర్వచించే లోతైన నీటి మేఘాలను మ్యాపింగ్‌ చేస్తారు. తుపానుతో కూడిన మేఘాలు శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే చాలా పొడవుగా ఉన్నాయని గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement