తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు అల్టిమేటం జారీ చేశారు. రెండు వారాల్లో తమ సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం..15 శాతం జీతం పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా..10 శాతం ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే నిమ్స్‌లో వైద్యం అందించేలా జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విధుల్లో మృతి చెందిన వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు.
తెలంగాణలో రోగులకు వైద్యం చేస్తున్న సిబ్బంది చాలా మంది చనిపోయారని, గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇంతవరకు అమలు చేయడం లేదంటున్నారు. జీవోలు కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.