Monday, November 25, 2024

Delhi | టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై న్యాయ విచారణ జరపాలి : తరుణ్ చుగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై సమగ్ర న్యా విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. బోర్డును రద్దు చేయాలని, సభ్యులందరినీ సస్పెండ్ చేయాలని అన్నారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలో పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న 30 లక్షల మంది విద్యార్థుల భవిష్త్ అగమ్యగోచరంగా మారిందని, ఈ స్కాంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని తరుణ్ చుగ్ కోరారు. రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చిన కేసీఆర్ కుటుంబ కుట్రలు బట్టబయలయ్యే సమయం ఆసన్నమైందని జోస్యం చెప్పారు. పేపర్ లీకేజీ అంశం వెలుగులోకి వచ్చాక కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెచ్చారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన విఫలమయ్యారని తరుణ్ చుగ్ విమర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement