పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తనకు జరిగిన అన్యాయంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)ని ఆశ్రయించింది. వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లోని తాత్కాలిక విభాగం ఈ విషయాన్ని చేపట్టింది. అయితే ఈ కేసులో ఈరోజు తీర్పు వస్తుందని భావించగా.. ఈ తీర్పును రేపటికి ఆగస్టు 11కి వాయిదా వేశారు.
100 గ్రాముల అధిక బరువు కారణంగా 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్ ఫైట్‌కు దూరమైన ఫోగాట్.. సెమీ ఫైనల్ మ్యాచ్ గెలిచినందుకు తనకు పతకం ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. సెమీస్ లో తన చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిపి తనకు రజతం ఇవ్వాలని వినేష్ ఫోగట్ విజ్ఞప్తి చేసింది. వినేష్ తరఫు న్యాయవాదులు హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా ఆ పతకం వినేష్ కు మాత్రమే చెందాలని వాదించారు. విచారణ తర్వాత సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు భారత ఒలింపిక్ సంఘం, లాయర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు తీర్పు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేస్తారు అనుకున్నారు. కానీ ఇది మళ్ళీ వాయిదా పడింది.