Friday, November 22, 2024

SC ST Act: కులం పేరుతో పిలిస్తే అది నేరం కాదు : అలహాబాద్ హైకోర్టు

లక్నో: బయటి వ్యక్తులు ఇంట్లో లేనప్పుడు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో పిలిస్తే అది నేరం కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. అలా పిలిచిన ఘటనలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తించదని స్పష్టం చేసింది.

బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగా ఈవిధంగా పిలిస్తేనే నేరాభియోగాన్ని మోపే అవకాశం ఉంటుందని జస్టిస్ షమీమ్ అహ్మద్ తెలిపారు. 12వ తరగతి పరీక్షల్లో తన కొడుకును ఫెయిల్ చేశారంటూ ఓ వ్యక్తి కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనకు దిగాడు.

అనంతరం ఏకంగా కాలేజీ నిర్వాహకుడి ఇంటికి వెళ్లగా అతడు లోపలికి పిలిచాడు. ఈ క్రమంలో తనను కులం పేరుతో కాలేజీ నిర్వాహకుడు దూషించాడంటూ విద్యార్థి తండ్రి కోర్టుకెక్కాడు. విచారణ చేసిన అలహాబాద్ హైకోర్టు కాలేజీ నిర్వాహకుడు బహిరంగంగా ఎక్కడా కులదూషణ చేయలేదని గుర్తించింది. అతడిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అభియోగాలను కొట్టివేస్తూ పై వ్యాఖ్యలు చేసింది. ఇంటర్ విద్యార్థుల ఎగ్జామ్ రిజల్ట్ అనేది కాలేజీ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement