Thursday, January 30, 2025

Judgement – పిజి వైద్య విద్య‌లో రాష్ట్ర రిజ‌ర్వేష‌న్ లు ర‌ద్దు … సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు…

న్యూ ఢిల్లీ : వైద్యవిద్యలో నివాస ఆధారిత కోటాను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులో అనుసరిస్తున్న ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. “మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. దేశంలోని ఏ విద్యాసంస్థలోనైనా చదువుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. మనమంతా భారత్ భూభాగంలో నివసిస్తున్నాం కాబట్టి ఏ ప్రావిన్స్, ఏ రాష్ట్ర నివాసం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఉద్యోగం, వ్యాపారం చేసుకోవడానికి దేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉంది. అలాగే చదువుకునే హక్కు కూడా” అని ధర్మాసనం వెల్లడించింది.


నిర్దిష్ట రాష్ట్రంలో నివసించేవారి విషయంలో రిజర్వేషన్ల గురించి ఆలోచించవచ్చని, అయితే అది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వరకే అని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఉన్నతవిద్యా కోర్సుల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే.. ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేషన్లకు ఈ తీర్పు వర్తించదని పేర్కొంది.


పీజీ మెడికల్ కోర్సులకు నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలో పంజాబ్-హరియాణా కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని పలువురు సుప్రీంకోర్టు లో సవాల్ చేయగా.. ఇద్దరు సభ్యుల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే కేసు ప్రాముఖ్యత దృష్ట్యా దానిని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫారసు చేసింది. ఈక్రమంలోనే తాజా తీర్పు వెలువడింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement