Tuesday, November 26, 2024

Judgement – మ‌గాళ్ల‌దే త‌ప్పు కాదు…. అలాంట‌ప్పుడు వారినే త‌ప్పుప‌ట్ట‌లేం


పెళ్లి చేసుకుంటానని 2019లో తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని.. అయితే ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని ఓ మహిళ ప్రయాగ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కులం గురించి కించపరిచేలా మాట్లాడాడని ఫిటిష‌న‌ల్‌లో పేర్కొంది. విచారణ అనంతరం 2020లో నిందితుడిపై చార్జిషీట్ దాఖలైంది. ఇక‌.. ప్రయాగ్‌రాజ్‌లోని ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 8, 2024న అత్యాచారం అభియోగం కింది నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఐపీసీ సెక్షన్ 323 కింద అతడిని కోర్టు దోషిగా తేల్చింది. అయితే.. ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసును విచారించిన కోర్టు, ఇద్దరి మధ్య సంబంధం ఏకాభిప్రాయంతో కుదిరినట్లు గుర్తించింది. మహిళది యాదవ కులం కాదని తెలిసిన తర్వాత అతను ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. ఆ మహిళ 2010లో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న విషయాన్ని కూడా దాచిపెట్టినట్లు, భర్తకు రెండేళ్లుగా దూరంగా ఉన్నట్లు కోర్టు గుర్తించింది.

అత‌ను నిర్ధోషి

ట్రయల్ కోర్టు ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. పెళ్లై, అంతకుముందు వివాహాన్ని రద్దు చేసుకోకుండా.. కులాన్ని దాచిపెట్టి మహిళా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఐదేళ్ల పాటు శారీరక సంబంధాన్ని కొనసాగించిన విష‌యాన్ని తేలికగా ఊహించవద్దని కోర్టు పేర్కొంది. ఇద్దరూ అలహాబాద్, లక్నోలోని అనేక హోటళ్లు, లాడ్జీల వెంట తిరిగి ఆనందించారు.. ఎవరిని ఎవరూ మోసం చేశారనేది నిర్ధారించడం కష్టమని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులు, అత్యాచారానికి గురైనట్లు బాధితురాలి వాదనలను అంగీకరించలేమని, ట్రయల్ కోర్టు నిందితులను నిర్దోషిగా విడుదల చేసిందని కోర్టు నిర్ధారించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement