హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. క్వాష్ పిటిషన్ను తోసిపుచ్చుతూ ఉత్తర్వులు వెలువరించింది. ఇదే సమయంలో కెటిఆర్ ను అరెస్ట్ చేయవద్దంటూ ఆయన న్యాయవాదులు న్యాయమూరిని కోరారు. ఇటువంటి కేసులలో అలా ఆదేశాలివ్వలేమని తీర్పు ఇచ్చారు..
- Advertisement -