ఆయన భార్య బుష్రా కూ ఏడేళ్లు జైలు
అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో నేడు తీర్పు
భారీగా జరిమానా.. కోర్టు గదిలోనే బుష్రా అరెస్ట్
ఇస్లామాబాద్ – 190 మిలియన్ ఫౌండ్ అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అడియాలా జైలులోని తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి నాసిర్ జావేద్ రాణా ఈ కేసులో నేడు కీలకమైన తీర్పును వెలువరించారు.
దీనితో పాటు ఇమ్రాన్ కు రూ.10 లక్షలు, బుష్రాకు రూ.5 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో వారికి 6 నెలల జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.. ఇక ఇమ్రాన్ భార్య బుష్రా బీబీని కూడా అరెస్టు చేయాలని ఆదేశించింది. తీర్పు వినడానికి ఆమె అడియాలా జైలుకు హాజరయ్యారు. అక్కడ పోలీసులు ఆమెను అధికారిక అరెస్టు చేశారు. ఇక ఇమ్రాన్ ఇప్పటికే జైలులో ఉన్నారు..