Wednesday, November 20, 2024

Judgement – అలా చేస్తే .. అది అత్యాచారమే

అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు
ఆశ చూపినా, భ‌యంతో శృంగారంలో పాల్గొన్నా లైంగిక దాడే
చాలాకాలంగా ఆ బంధం ఉంది
పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు
ఆ వాద‌న‌ల‌ను తోసిపుచ్చిన ధ‌ర్మాస‌నం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ :
భయంతో లేదా అశ‌ల భ్రమల్లో ఉన్న యువతి అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా దాన్ని అత్యాచారంగానే పరిగణించాలని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టంచేసింది. పెళ్లి చేసుకుంటాననే వంకతో లైంగికదాడికి పాల్పడ్డాడని ఒక వ్యక్తిపై కేసు నమోదు కాగా.. ఈ విచారణను నిలిపివేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అనిస్‌కుమార్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. విచారణలో భాగంగా పిటిషన్‌దారు తరఫు న్యాయవాది వాదిస్తూ.. కేసు పెట్టిన యువతికి, యువకుడికి చాలా కాలంగా పరిచయం ఉందని తెలిపారు. ఇద్దరూ సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారని, ఆ సమయంలో పరస్పర అంగీకారంతో దగ్గరయ్యారని నివేదించారు.

- Advertisement -

చాలాకాలంగా ఆ బంధం ఉంది..

ఆ బంధం చాలా కాలం పాటు కొనసాగిందని పిటిష‌న‌ర్ త‌రుపు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనను ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖండించారు. వీరివురి మధ్య బంధం పెళ్లి చేసుకుంటాన‌నే హామీతోనే కొన‌సాగింద‌ని ధర్మాసనానికి తెలిపారు. ఆధారాలను పరిశీలించిన కోర్టు.. ‘వీరివురి మధ్య బంధం పిటిషన్‌దారు బాధితురాలిని మోసం చేయడంతోనే ప్రారంభమైంది. దానికి ఆమె అంగీకారమూ లేదు. ఆ తర్వాత వీరిద్దరూ అంగీకారంతోనే దగ్గరై ఉండొచ్చు. కానీ ఆ బాధితురాలి ఒప్పుకోలు.. భయం, భ్రమల్లో నుంచి వచ్చినదే’ అని తెలిపింది. దీనిపై విచారణను నిలిపివేసేందుకు కారణమూ కనిపించడం లేదంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అతడిపై కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రిపాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement