జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రం జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)ని ఏర్పాటు చేసింది. పీపీ చౌదరి చైర్మన్‌గా మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ వాద్రా పేరును ప్రకటించారు.
కాగా, వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు సంబంధించి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన బిల్లులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రేపు (గురువారం) లోక్‌సభలో జేపీసీ ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ సమావేశాల చివరి వారంలో ఈ జేపీసీ కమిటీ తన నివేదికను సమర్పించనుంది.
జమిలి ఎన్నికల జేపీసీ కమిటీ సభ్యులు వీరే !
- పీపీ చౌదరీ
- డాక్టర్ సీఎం రమేష్
- బన్సూరీ స్వరాజ్
- పరుషోత్తం భాయ్ రూపాలా
- అనురాగ్ సింగ్ ఠాకూర్
- విష్ణు దయాల్ రామ్
- భర్తృహరి మహతాబ్
- డాక్టర్ సంబిత్ పాత్ర
- అనిల్ బాలుని
- విష్ణు దత్ శఱ్మ
- ప్రియాంక గాంధీ వాద్రా
- మనీష్ తివారీ
- సుఖ్‌దేవ్ భగత్
- ధర్మేంధ్ర యాదవ్
- కళ్యాణ్ బెనర్జీ
- టీఎం సెల్వగణపతి
- జీఎం హరీష్ బాలయోగి
- సుప్రియా సూలే
- డాక్టర్ శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే
- చందన్ చౌహాన్
- బాలశౌరి వల్లభనేని
ప్రస్తుతానికి లోక్‌సభ నుంచి ఎంపికైన 21 మంది సభ్యుల పేర్లను మాత్రమే కేంద్రం వెల్లడించారు. మిగిలిన 10 మంది రాజ్యసభ ఎంపీల పేర్లను త్వరలోనే ప్రకటించనున్నారు.