దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ ఛాయలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ కోరారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రియాశీలక కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో తాజాగా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతంగా ఉందని వెల్లడించారు. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో కరోనా మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభమైందని, 18-44 వయస్సు ఉన్న 20 లక్షల మందికి టీకాలు అందాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement