Saturday, November 23, 2024

జర్నలిస్ట్‌ నవికాకుమార్‌కు ‘సుప్రీం’ ఊరట

ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి నుపుర్‌ శర్మ కేసులో జర్నలిస్ట్‌ నవికాకుమార్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఆయా రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో నవికాను అరెస్ట్‌ చేయకుండా స్టే ఇస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారి చేసింది. ఓ న్యూస్‌ చానల్‌లో ప్రవక్తపై బిజెపి బహిష్కృత నేత నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

ఆ తర్వాత నుపుర్‌తో పాటు నవికా కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. భవిష్యత్తులో నమోదయ్యే ఎఫ్‌ఐఆర్‌లకు సైతం మినహాయింపు ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన రాష్ట్రాలకు నోటీసులు జారి చేసింది. తనపై నమోదైన కేసులను కొట్టి వేయాలని కోరుతూ నవికాకుమార్‌ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కృష్ణ మురారీ, జస్టిస్‌ హిమ కొహ్లిలతోకూడిన ధర్మాసనం విచారించి కేంద్ర, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారి చేసింది. సమాధానాలు ఇవ్వాలని కోరింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement