కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్ రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. అంతా ఓడిపోతుంది.. కోల్‌కతా పేసర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు వరుస పెట్టి పెవిలియన్‌కు క్యూ కడుతున్న సమయంలో బట్లర్ జోష్ పెంచాడు.. నిలకడగా ఆడుతూ దంచికొట్టాడు. దీంతో ఈ ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
234 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ టాపార్డర్ విఫలమైన వేల… జోస్ బట్లర్ వీరోచితంగా పోరాడాడు. 60 బంతుల్లో 107 పరుగులతో చెలరేగిపోయాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19), కెప్టెన్ సంజూ శాంసన్ (12) పరుగులకే పెవిలియన్ చేరగా.. రియాన్ పరాగ్ (34) పరుగుల వద్ద ఔటయ్యాడు. రోవ్‌మన్ పావెల్ జట్టుకు పరుగులు (26) జోడించి అతను కూడా ఔటయ్యాడు.
ఇక కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.