Monday, November 4, 2024

AP | జగనన్న విద్యా దీవెనకు జాయింట్‌ అకౌంట్‌.. ఈ నెల 24 వరకు గడువు

అమరావతి, ఆంధ్రప్రభ : డిగ్రీ, పీజీ, ఐటిఐ, డిప్లొమా, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌, మెడికల్‌, ప్రొఫెషనల్‌ కోర్సులు చదివే విద్యార్ధులకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకం ద్వావరా లబ్దిపొందాలంటే జాయింట్‌ అకౌంట్‌ ఉండాలి. ఇప్పటి వరకు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డిబిటి) పద్ధతిలో ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను లబ్దిదారులకు అందజేసేవారు. ఇకపై విద్యార్ధి, తల్లి పేరుతో ఉమ్మడి బ్యాంకు ఖాతాను (జాయింట్‌ అకౌంట్‌) తెరవాలని సోషల్‌ వెల్పేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జి. జయలక్ష్మి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 24వ తేదీలోగా అర్హులైన విద్యార్ధుల తల్లులు బ్యాంకు ఖాతా తెరవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ యేడాది ఏప్రిల్‌-జూన్‌ సమయంలో ప్రభుత్వం రూ. 680.44 కోట్లను 8, 44,336 మంది విద్యార్థుల తల్లులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తాజాగా ఈ నాలెఖరులోగా 4వ విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పథకంలో నూతన మార్పులు తీసుకువస్తూ సోషల్‌ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

- Advertisement -

జిల్లా కలెక్టర్‌లు లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్స్‌ (ఎల్‌డిఎమ్‌), బ్యాంకు కో ఆర్డినేటర్లతో ప్రతేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త నిబంధనలు బ్యాంకు మేనేజర్లకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా వెల్ఫేర్‌ అధికారి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఒకో బ్రాంచ్‌లో రోజుకు 100 మంది చప్పున కొత్త ఉమ్మడి బాంకు ఖాతాలు తెరిచేలా జిల్లా కలెక్టర్లు ప్రణాళిక రూపొందించి అమలు జరిగేలా బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement