ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ అగ్రస్థానంలో నిలిచాడు. భారత్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో రాణించడంతో తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు 5వ స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ నాల్గో స్థానానికి దిగిజారిపోయాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 9వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయమ్సన్ ఆరో స్థానం, ఉస్మాన్ ఖావజా 7, దిముత్ కరుణ రత్నె 8, జానీ బెయిర్ స్టో 10వ స్థానంలో నిలిచారు. పంత్, రోహిత్ మినహా టీమిండియా ఆటగాళ్లు ఎవరికీ టాప్-10లో చోటు దక్కలేదు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి 13వ ర్యాంకుకు పడిపోయాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.