కీవ్ – ఆమెరికా అధ్యక్షుడు జో బైడన్ నేడు ఉక్రైయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు.. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆమెరికా అధ్యక్షుడు తన ప్రత్యేక విమానంలోకీవ్ లో ల్యాండయ్యారు.. ఆయనకు ఉక్రైయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సతీ సమేతంగా ఘనస్వాగతం పలికారు.. అనంతరం ఈ ఇద్దరు నేతలు వివిధ అంశాలపై రెండు గంటల పాటు చర్చలు జరిపారు.. ఈ నెల 24వ తేదికి రష్యా యుద్దం ప్రకటించి ఏడాది కావస్తున్న తరుణంలో ఆమెరికా అధ్యక్షుడి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ సందర్భంగా బైడెన్ వరుస ట్విట్లు చేశారు. చిన్నదేశమైన ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలనే పుతిన్ కల నెరవేరదని పేర్కొన్నారు.. ఉక్రైయిన్ లో ప్రజాస్వామ్య పరిరక్షణకు తనతో పాటు నాటో దేశాలు అండగా ఉంటామని చెప్పారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement