ఏపీలోని గుంటూరు జిల్లాలో పలు మెడికల్ ఉద్యోగాల భర్తీకి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 136 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. పెడియాట్రీషియన్, స్టాఫ్ నర్స్, సపోర్ట్ స్టాఫ్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 6న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్‌లో సూచించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలను గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.
★ పెడియాట్రీషియన్ విభాగంలో మొత్తం 46 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. MD/Dch/DNB ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 70 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు వేతనం చెల్లిస్తారు
★ స్టాఫ్ నర్స్ విభాగంలో 54 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమో లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేయవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.24 వేల వేతనం చెల్లిస్తారు
★ సపోర్టింగ్ స్టాఫ్(MNO/FNO) విభాగంలో 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు. SSC/ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల వరకు వేతనం చెల్లిస్తారు.
ఈ వార్త కూడా చదవండి: ఆరుగురు తృణమూల్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు