Thursday, November 21, 2024

విస్తారాలో ఉద్యోగాలు, 5వేల మంది రిక్రూట్‌మెంట్‌: సీఈఓ వినోద్‌ కన్నన్‌

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు, సామర్థ్యం పెంచడంతో పాటు మరిన్ని మార్గాల్లో తమ విస్తరింపజేసందుకు విస్తారా ఎయిర్‌లైన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ ఎత్తున సిబ్బంది నియామకం చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది 5వేల మందిని కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేసుకోనున్నట్టు యోచిస్తున్నది. ప్రస్తుతం విస్తారాలో 4వేల సిబ్బంది పని చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎయిర్‌ లైన్స్‌ సేవలు నిలిచిపోయాయి. మూడో వేవ్‌ నుంచి కొంత కోలుకుంటుండటంతో సేవల విస్తరణతో పాటు ఆర్థికంగా పుంజుకునేందుకు నిర్ణయించినట్టు విస్తారా తెలిపింది.
ఇప్పుడిప్పుడే.. ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు విస్తారా సీఈఓ వినోద్‌ కన్నన్‌ తెలిపారు. గతేడాది చివర్లో రికవరీ మార్గంలో ఉన్న ఎయిర్‌ ట్రాఫిక్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేసిన మూడో వేవ్‌తో సహా కరోనా వైరస్‌ మహమ్మారి గణనీయంగా దెబ్బతిన్నది.

ఆ తరువాత ఎయిర్‌లైన్‌ పరిశ్రమ మళ్లి ట్రాఫిక్‌ సంఖ్యలో పెరుగుదుల కనిపిస్తున్నది. ఫిబ్రవరిలో డిమాండ్‌ పెరిగింది. ప్రజలు ప్రయాణించడం ప్రారంభించారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా ముందు పరిస్థితులతో పోలిస్తే.. విమానాల సంఖ్య పెంచినట్టు వివరించారు. రోజుకు దాదాపు 220 నుంచి 250 విమానాలు సేవలు అందిస్తుంటాయి. సిబ్బంది కూడా అహర్నిశలు కృషి చేస్తున్నది. ప్రస్తుతం విస్తారా వద్ద 50 విమానాలు ఉన్నాయి. 2023 చివరి నాటికి 70కు పెంచాలని నిర్ణయించుకున్నాం. టాటాస్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ మధ్య జాయింట్‌ వెంచర్‌ అయిన విస్తారా.. మూడో వేవ్‌కు ముందు గతేడాది అక్టోబర్‌లో నియామకాలు ప్రారంభించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement