అమరావతి, ఆంధ్రప్రభ: భారతీయ రైల్వే సెంట్రల్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్‌కు సంబం ధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లు ఫిబ్రవరి 23 నుంచి నిర్వహించే అవకాశాలున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. గురు వారం ఒక ప్రకటనలో కోవిడ్- 19 మహమ్మారిని దృష్టిలో పెట్టు-కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సమయా నుకూలంగా వివిధ దశలలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహించే పట్టణాల వివరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ప్రయాణానికి సంబంధించిన పాసుల డౌన్‌లోడింగ్ వివరాలు పరీక్షలు ప్రారంభమ వడానికి పది రోజుల ముందే ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్లలో ఉంచడం జరుగుతుందని తెలిపింది.
సీబీటీ పరీక్ష నిర్వహించే పట్టణాలు, తేదీ వివరాలతో ఉండే కాల్ లెటర్లను పరీక్షకు 4 రోజులు ముందు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి 4 లక్షల 85 వేల 607 మంది అభ్యర్థుల దరఖాస్తులలో ఫొటోలు లేదా సంతకాలు సరిపోకపోవడంతో తిరస్కరించినట్లు స్పష్టం చేసింది. వాటికి సంబంధించి అన్ని ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు సరైన ఫొటోలు, సంతకాలు అప్‌లోడింగ్ చేసుకొనే అవకాశాన్ని రైల్వే కల్పిస్తోంది. ఆ తర్వాత పరిశీలనలో ఆర్‌ఆర్‌బీల నిర్ణయమే తుదిగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో ఆమోదించిన దరఖాస్తుల అభ్యర్థులు కూడా వివిధ దశలలో జరిగే సీబీటీ పరీక్షలలో పాల్గొనవచ్చు.
నియామక ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీల అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే పరిశీలించాలని సూచించింది. అనధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని కోరింది. చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వాగ్దానాలతో అభ్యర్థులను మోసగించేందుకు ప్రయత్నించే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆర్‌ఆర్‌బీ నియామకాలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జరుగుతాయని, ఎంపిక ప్రక్రియ కేవలం అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఉంటు-ందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.