హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిసిన అనంతరం బదిలీలు చేపడతామని అధ్యాపకులకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఈమేరకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఇంటర్ వార్షిక పరీక్షల అనంతరం ఇంటర్ విద్యలో పనిచేసే ఉద్యోగులకు తప్పకుండ బదిలీలు చేపడతామని వారికి హామి ఇచ్చినట్లు అసోసియేషన్ నేతలు తెలిపారు. దీంతోపాటు ఇంటర్ వార్షిక పరీక్షలలో డీఈసీ కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రిని కలిసినవారిలో మైలారం జంగయ్య, లక్ష్మయ్య, సైదులు తదితరులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..