Tuesday, December 3, 2024

TG | ఓయూలో ఈ నెల 19న‌ జాబ్‌మేళా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఎంప్లాయిమెంట్ బ్యూరో, బొండాడ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త నిర్వహణలో ఈ నెల 19న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.

ఈ జాబ్ మేళా ద్వారా కంపెనీలో 50 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 50 ఏళ్లలోపు ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ చదివిన వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తామని యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది.

తమ విద్యార్హత సర్టిఫికెట్లతో నవంబర్ 19న ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరోలో హాజరుకావాలని ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు హెచ్‌ఆర్‌ రాహుల్‌ను నేరుగా లేదా సెల్‌ 9398722629కు సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement