Tuesday, November 26, 2024

Layoff | ఓయోలో ఉద్యోగాల కోత.. 600 మందికి ఉద్వాసన పలికిన సంస్థ

మన దేశంలోనూ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. బైజూస్‌, జొమాటో ఇప్పటికే ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు అతిధ్య సేవలందించే ఓయో కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ విభాగానికి చెందిన 600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ విజభాగంలో టీమ్‌లోకి కొత్తగా 250 మందిని తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఓయోలో 3,700 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు సంస్థ శనివారం నాడు ప్రకటించింది.

దీనిలో భాగంగా టెక్నాలజీ విభాగంలో 600 మందికి తొలగిస్తున్నట్లు తెలిపింది. సంస్థలో చేపట్టిన విస్త్రత మార్పుుల్లో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఓయో తెలిపింది. ప్రొడక్ట్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఉద్యోగుల తగ్గింపు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. పార్టనర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో మాత్రం కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల పాటు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం కొనసాగుతుందని ఓయో తెలిపింది. భవిష్యత్‌లో ఆయా విభాగాల్లో కొత్త నియామకాలు చేపడితే, ఇప్పుడు తొలగించిన వారికి ప్రాధాన్యత ఇస్తామని వ్యవస్థాపక ఈసీఓ రితేష్‌ అగర్వాల్‌ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement