తెలంగాణ లో ఇకపై ఉద్యోగ నియామకాలకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై విస్తృతంగా చర్చించింది. ఇదే అంశంపై చర్చించేందుకు రేపు మధ్యాహ్నం 2గంటలకు మరోమారు సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్యోగుల కేటాయింపులపై టీఎన్‌జీవో, టీజీవో విజ్ఞప్తిపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్ తయారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియపై రేపు కూడా మంత్రివర్గం చర్చించనుంది. కొత్త జోనల్ వ్యవస్థ మేరకు ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టనున్నారు. నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని కేబినెట్ ఆదేశించింది.
ఇది కూడా చదవండి: నా పేరు తొలగించండి.. సీబీఐ కోర్టును అభ్యర్థించిన సీఎం జగన్