Friday, November 22, 2024

కొత్త సర్టిఫికెట్స్‌ కోర్సులను ప్రారంభించిన జేఎన్టీయూహెచ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జేఎన్టీయూహెచ్‌ వర్సిటీ కొత్త సర్టిఫికేట్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగాలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడానికి వీలుగా ఈ కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. డేటాసైన్స్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ అండ్‌ డెవలపర్స్‌ వంటి డిమాండ్‌ ఉన్న రంగాలకు సరిపడా ఆరు నెలల సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌ కోర్సులను రూపొందించినట్లు పేర్కొంది. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం వర్సిటీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ సర్టిఫికేట్‌ కోర్సును అందిస్తోందని, రాబోయే రోజుల్లో మరికొన్ని సర్టిఫికేట్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఏదైనా విభాగంలో డిప్లొమా, అండర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌లో ఉత్తీర్ణులైన, చదువుతున్న అభ్యర్థులు ఈ కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు జూలై 23 చివరి తేదీ అని ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement