Christmas Day 2021: కాశ్మీర్ లోయలో వివిధ రకాల వేడుకలు జరుగుతున్నాయి. కాశ్మీర్ అందాలను చూడ్డానికి వచ్చే టూరిస్టులకు, లోకల్ పీపుల్ అయిన కాశ్మీరీలకు ఈ పండుగను మరింత సంతోషంగా మార్చడానికి అక్కడి టూరిజం డిపార్ట్‌మెంట్ సరికొత్త కార్యక్రమాలు, ఈవెంట్స్‌ని నిర్వహిస్తోంది. కాగా, జమ్మూ కాశ్మీర్ లోని ఐహెచ్‌ఎంలో క్రిస్మస్ పండుగకు కేక్ మేకింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ప్రిలిమినరీ, చివరి రౌండ్ ముగిశాయి. రెండు రౌండ్లుగా నిర్వహించిన పోటీల్లో తమ ప్రతిభ కనబర్చిన ఎనిమిది మంది నైపుణ్యం కలిగిన పారిశ్రామికవేత్తలు చివరి రౌండ్‌లోకి ప్రవేశించారు.
“ఈ ప్రత్యేకమైన కేక్ బేకింగ్ పోటీ సహాయంతో యువ పారిశ్రామికవేత్తలు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది సరైన వేదిక. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (IHM) యొక్క పర్యాటక విభాగం ఫ్యూచర్‌లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలి, తద్వారా ఎంతో మంది యువకులు వారి భవిష్యత్తుకు కోసం గుడ్ ఓపెనింగ్‌ని పొందుతారు” అని నిర్వాహకులు తెలిపారు.