Tuesday, November 26, 2024

JK | ఎన్‌కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు హతం..

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నిన్న (శనివారం) నలుగురు ఉగ్రవాదులు హతమవ్వ‌గా… ఈరోజు (ఆదివారం) మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వైన్ మాట్లాడుతూ… కుల్గాంలో ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందం భారీ విజయాన్ని సాధించిందని అన్నారు. రెండు ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఒక ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ముగిసిందని, మరో చోట కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు.

అయితే ఈ దాడుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఫ్రిసల్‌లోని చిన్నిగాం, ముదర్గాం ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పారా కమాండో లాన్స్ నాయక్ ప్రదీప్ నైన్, నేషనల్ రైఫిల్స్ సైనికుడు ప్రవీణ్ ప్రభాకర్ గాయపడ్డారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే వారి పేర్లను సైన్యం అధికారికంగా ధృవీకరించలేదు. ఆదివారం వీరిద్దరికీ సైనిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement