సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 సరైనదే అని, రోడ్ల మీద సభలు, రోడ్‌షోలు నిర్వహించే సందర్భాల్లో అనువైన స్థలాలను అంచనా వేసేందుకు పోలీసుల అనుమతిని తప్పనిసరి అన్నది మంది నిర్ణయం అన్నారు. ఇటీవల జరిగిన ఘటనల దృష్ట్యా ఈ జీవోను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్దానం కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చూస్తుంటే ఆనందంగా ఉందని, ప్రభుత్వ పనితీరు బాగుందన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పద్మనాభపురం వద్ద నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిని జేడీ లక్ష్మీనారాయణ పరిశీలించారు. కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని, వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడం గొప్ప విషయం అన్నారు. ఉద్దానంలో ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించడం గొప్ప విషయం అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement