Tuesday, November 19, 2024

JIPMAT 2024 | ఎంబీఏ ప్రవేశానికి ‘జిప్‌మ్యాట్’… నోటిఫికేషన్ విడుదల!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) బోధ్ గయా, జమ్మూ సంయుక్తంగా అందించే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (IPM)లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఇంటర్ అర్హతతో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 22లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.2000 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 6న నిర్వహించే పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement