ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో మరో రెండు కొత్త ప్రీపెయిండ్ ప్లాన్లను విడుదల చేసింది. రోజుకు 2.5 జీబీ వ్యాలిడిటీతో నెల, మూడు నెలల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. కొత్త ప్లాన్స్‌ను 349, 899 రూపాయల ధరల్లో వీటిని విడుదల చేసింది. ఎక్కువ డేటా ఉపయోగించే వారికి ఈ కొత్త ప్లాన్స్ అనుకూలంగా ఉంటాయి. జియో తీసుకు వచ్చిన 349 ప్లాన్ కాలవ్యవధి 30 రోజులు. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ సేవలు అధనంగా లభిస్తాయి. 5జీ నెట్వర్క్ ఉన్న ప్రాంతంలో ఉన్నవారు, దీన్ని సపోర్టు చేసే ఫోన్ ఉన్న వినియోగదారులు వెల్కమ్ ఆఫర్ కింద అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.
90 వ్యాలిడిటీతో వచ్చిన 899 రూపాయల ప్లాన్‌లో కూడా రోజుకు 2.5 జీబీ డేటా వస్తుంది. అపరిమి కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు వస్తాయి. పైన తెలిపిన ప్లాన్‌లోని అన్నీ దీంట్లోనూ వస్తాయి. ఈ సంవత్సరం కొత్తగా తీసుకు వచ్చిన 2023 రూపాయల ప్లాన్‌లోనూ ఇవే సదుపాయలు ఉన్నాయి. ఈ ప్లాన్ వ్యవధి 252 రోజులు. మొత్తం 630 జీబీ డేటా వస్తుంది.