Saturday, October 26, 2024

ఫిక్స్ డ్‌ లైన్‌లోనూ జియో ఫస్ట్‌.. బీఎస్​ఎన్​ఎల్​ను వెనక్కి నెట్టేసి మరింత ముందుకు

దేశీయ ప్రయివేటురంగ టెలికాం సంస్థ జియో మరొక రికార్డును దక్కించుకుంది. దేశంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్‌లైన్‌ సేవల ప్రొవైడర్‌గా నిలిచింది. ఫిక్స్‌డ్‌లైన్‌ సేవల్లో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను వెనక్కినెట్టింది. ఆగస్టు నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌కు 71.32 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా, జియో ఖాతాదారుల సంఖ్య 73.52 లక్షలకు చేరుకుంది. 22 ఏళ్లుగా సేవలు అందిస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్‌ను మూడేళ్ల కింద ఆవిర్భవించిన జియో అధిగమించడం విశేషం. దేశంలో టెలికాం సేవలు ప్రారంభం అయిన తర్వాత ఓ ప్రయివేటు సంస్థ ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం.

జియో కొత్తగా 2.62 లక్షల ఖాతాదారుల్ని పెంచుకోగా, ఎయిర్‌టెల్‌ 1.19 లక్షలు, వొడాఫోన్‌ ఐడియా 4202, టాటా టెలిసర్వీసెస్‌ 3769 మంది చందాదారులను చేర్చుకున్నాయి. ప్రభుత్వరంగంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 15,734 మంది, ఎంటీఎన్‌ఎల్‌ నుంచి 13,395 మంది చందాదారులు బయటకు వచ్చేశారు. ఇక దేశంలో మొత్తం టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఆగస్టు నాటికి 117.5 కోట్లకు చేరుకుంది. ఈ విభాగంలో జియో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో కొత్త చందాదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement