ఐపీఎల్ మ్యాచ్‌లతో అత్యధిక వ్యూవర్ షిప్ పొందిన జియో సినిమాను అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంగా మార్చేందుకు రిలయన్స్ ప్రయత్నాలు చేస్తోంది. జియో సినిమా యాప్ లో ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించేందుకు రిలయన్స్ అవకాశం కల్పించింది. దీంతో, ఈ మ్యాచ్‌లను కోట్లాది మంది చూస్తున్నారు. ఈ విషయంలో జియో సినిమా సరికొత్త రికార్డ్‌లు సృష్టించింది. ఐపీఎల్ మ్యాచ్‌లు అయిన తరువాత జియో సినిమా కంటెంట్‌కు డబ్బులు వసూలు చేయాలని రిలయన్స్ భావిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థలైన నెట్‌ప్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లకు పోటీగా నిలిచేందుకు 100కు పైగా సినిమాలను, టీవీ సీరియల్స్‌ను సిద్ధం చేస్తోంది.
ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకున్ను వయాకామ్ 18, జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా అందిస్తున్నది. దీంతో జియో సినిమాను రికార్డ్ స్థాయిలో వీక్షకులు చూస్తున్నారు. దీన్ని కొనసాగించేందుకు రిలయన్స్ నిర్ణయించింది. ఇందు కోసం పూర్తి స్థాయి కంటెంట్‌ను అందించాలని భావిస్తోంది. పూర్తి కంటెంట్ ను యాడ్ చేసిన తరువాత ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ విషయానని రిలయన్స్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్ పాండే తెలిపారు.
ఐపీఎల్ మ్యాచ్‌లు మే 28న ముగుస్తాయి. ఈ లోపుగానే జియో సినిమాలో కంటెంట్‌ను యాడ్ చేయాలని భావిస్తున్నామని జ్యోతి దేశ్‌పాండే తెలిపారు. జియో సినిమా, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌కు వసూలు చేసే మొత్తాన్ని అందుబాటు ధరలోనే ఉంచాలని భావిస్తున్నామని తెలిపారు. జియో సినిమాలో దేశీయ కంటెం ట్‌నే అందిస్తామని చెప్పారు. జియో సినిమా ఐపీఎల్ ప్రారంభమైన వారంలో 5.5 మిలియన్లు, ఏప్రిల్ 12న జరిగిన చెన్నయ్ – రాజస్థాన్ మ్యాచ్‌ను రికార్డ్ స్థాయిలో 22 మిలియన్ల మంది వీక్షించారని జియ సినిమా తెలిపింది.
ఐపీఎల్ ముగిసే వరకు ఎయిర్‌టెల్, వోడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు ఉచితంగా ప్రసారాలు ఇస్తామని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హీట్ స్టార్, వయాకామ్ 18 ప్రసారం చేస్తున్నాయి. డిస్నీ స్టార్ స్పోర్ట్ భారత ఉప ఖండంలో టీవీ ప్రసార హక్కులను 23,575 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.