రిలయన్స్ జియో త్వరలో కొత్త సర్వీస్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. సరికొత్త వైఫై సర్వీస్‌లను జియో ఎయిర్‌ఫైబర్ పేరుతో జియో తీసుకు వస్తున్నది. కొద్ది నెలల్లోనే రిలయన్స్ జియో ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఆర్‌ఐఎల్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ తెలిపారు.
మోడెమ్‌తో సేవలు..
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న వైఫై సేవలు కేబుల్ ద్వారా అందిస్తున్నారు. రిలయన్స్ జియో సేవలు పొందేందుకు వైర్‌తో పాటు మోడెమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జి యో గిగా ఫైబర్ ఇదే తరహాలో పని చేస్తోంది. జియో ఎయిర్ ఫైబర్‌కు కేబుల్ వేయాల్సిన అవసరంలేదు. ఇది ఒక సింగిల్ డివైజ్. దగ్గరలోని జియో టవర్ నుంచి వీటికి సిగ్నల్స్ అందుతాయి. దీని ద్వారా సాధారణ బ్రాడ్‌బ్రాండ్ తరహాలోనే స్పీడ్ ఇంటర్‌నెట్ సేవలను యూజర్లు పొందవచ్చని కంపెనీ తెలిపింది. వెయ్యి చదరపు అడుగుల దూరం వరకు యూజర్లు వైఫై సేవలు పొందవచ్చు. ఈ డివైజ్‌ను ఇళ్లలో, ఆఫీసుల్లో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ యూప్ సాయంతో యూజర్లు నియంత్రించవచ్చు.
యాప్ ద్వారా కొన్ని వెబ్‌సైట్‌లను కూడా యూజర్లు బ్లాక్ చేసుకోవచ్చు. సాధారణ రైటర్ ఏర్పాటుకు అవసరమైనట్లుగానే ఎయిర్ ఫైబర్ ఇన్‌స్టాలేసన్ కోసం సాంకేతిక నిపుణుల అవసరం ఉండదు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఇది పని చేస్తుందని రిలయన్స్ జియో తెలిపింది. జియో ఎయిర్ ఫైబర్‌లో క్రికెట్ మ్యాచ్‌ల మల్టి వీడియో స్ట్రీమ్స్‌ను పొందవవచ్చు. ఒకే సారి పలు కెమెరా కోణాల్లో అల్ట్రా హై డెఫినేషన్‌తో చూడొచ్చని జియో తెలిపింది.
జియో సినిమా ప్లాన్స్..
రిలయన్స్ జియో సినిమా త్వరలో యూజర్ల కు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అందించనుంది. వీటి ద్వారా రుసుము వసూలు చేయానున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్‌ను ప్రసారాలను మాత్రం ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా ఇవ్వడంతో విపరీతంగా ఆదరణ పొందుతున్నది. రికార్డ్ స్థాయిలో వీక్షకులు రిలయన్స్ సినిమాలో ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తున్నారు. జియో సినిమా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి కొత్త సినిమాలు, వెబ్ సీరిస్‌లు, మ్యూజిక్ వీడియోలతో యూజర్లకు అందుబాటులోకి తీసుకు వస్తున్నది. జియో సినిమా ఓటీటీల మాదిరిగానే నెల, మూడు, ఆరు నెలలు, సంవత్సర చందాలతో రానుందని తెలుస్తుంది. ఐపీఎల్‌ను మాత్రం ఉచితంగానే వీక్షించే వీలు కల్పించనున్నట్లు తెలిపింది. జియో సినిమా నుంచి మూడు ప్లాన్లు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది.
డైలీ, గోల్డ్, ప్లాటినం పేరుతో ఈ ప్లాన్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. డైలీ ప్లాన్‌ను 2 రూపాయలకే అందించనుంది. ఈ ప్లాన్ ధరను జియో 29గా పేర్కొంది. డిస్కౌంట్‌లో దీన్ని 2 రూపాయలకే అందిస్తారు. 2 రూపాయలతో 24 గంటల పాటు కంటెంట్‌ను చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఒకేసారి రెండు డివైజ్‌ల్లో వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. గోల్డ్ ప్లాన్ ధరను 299గా పేర్కొన్నారు. డిస్కౌంట్‌లో ఇది 99 రూపాయలకే ఇవ్వనున్నారు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ మూడు నెలలు. ఈ ప్లాన్‌లో రెండు డివైజుల్లో ఒకేసారి కంటెంట్‌ను చూడవచ్చు. ప్రీమియం ప్లాన్ ధర 1199 రూపాయలుగా పేర్కొంది.
డిస్కౌంట్ తో ఈ ప్లాన్‌ను 599కే అందించనుంది. ఇది సంవత్సరం ప్లాన్. ఒకేసారి 4 డివైజ్‌ల్లో కంటెంట్‌ను వీక్షించే అవకాశం ఉంది. లైవ్ కంటెంట్‌లో మాత్రమే యాడ్స్ ఉంటాయి. మిగిలిన వాటిలో ఎలాంటి యాడ్స్ ఉండవని రిలయన్స్ జియో సినిమా పేర్కొంది. ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తయ్యేలోగానే పెయిడ్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టాలని రిలయన్స్ భావిస్తోంది. ఐపీఎల్ పూర్తయ్యేంత వరకు మ్యాచ్‌లను ఉచితంగానే చూడవచ్చు. వీక్షకులు ఆదర ణ బాగున్నప్పుడే ప్లాన్స్‌ను అమలు చేయాలని భావిస్తోంది. ప్లాన్ వివరాలను రిలయన్స్ జియో సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.