రిలయన్స్ జియో తమ 5జీ సేవలను తెలంగాణలోని మరో 14 నగరాల్లో లాంఛనంగా ప్రారంభించింది. కొత్తగా జియో 5జీ సేవలు కామారెడ్డి, మిర్యాలగూడ, పాల్వంచ, గద్వాల, ఆర్మూర్, సిరిసిల్ల, భువనగిరి, బోధన్, వనపర్తి, బెల్లంపల్లి, కాగజ్ నగర్, పెద్దపల్లి, కోరుట్ల, మందమర్రి నగరాల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా, ఇప్పటికే 19 నగరాల్లో (హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల, సిద్ధిపేట, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్, సూర్యాపేట) రిలయన్స్ జియో తమ ట్రూ 5జీ సేవలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
కొత్తగా ప్రారంభించిన 14 నగరాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 నగరాల్లో జియో వినియోగదారులు 5జీ సేవలను పొందవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ 14 నగరాల్లో జియో వినియోగదారులకు జియో వెల్కమ్ ఆఫర్ ఆహ్వానం అందుతుంది. దీనిద్వారా వారు అదనపు ఖర్చు లేకుండా 1 జిబిపిఎస్ + వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు.